యాక్షన్‌లో ‘స్పార్క్’ ఉంది
ABN , First Publish Date - 2023-08-26T05:12:11+05:30 IST
విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ కథానాయికలు...

విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురు సోమ సుందరం ప్రతినాయకుడిగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. పాన్ ఇండియా స్థాయిలో నవంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘భారీ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందిన చిత్రమిది. కథ, కథనాల్లో స్పార్క్ ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింద’’న్నారు దర్శకుడు. నాజర్, సుహాసిని, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.