హలో.. మిస్టర్‌

ABN , First Publish Date - 2023-05-03T01:47:18+05:30 IST

ఆర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ ఎక్స్‌’. గౌతమ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రధారి. మను ఆనంద్‌ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు...

హలో.. మిస్టర్‌

ఆర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ ఎక్స్‌’. గౌతమ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రధారి. మను ఆనంద్‌ దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. నిర్మాత లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘అరుదైన కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఉగాండా, సెర్బియా తదితర దేశాలలో చిత్రీకరణ జరుపుతాం. యాక్షన్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. వాటిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామ’’న్నారు.

Updated Date - 2023-05-03T01:47:18+05:30 IST