ప్రేమికుల ప్రణయ గీతం

ABN , First Publish Date - 2023-09-07T02:08:52+05:30 IST

దినేష్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. పాయల్‌ రాధాకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ప్రేమికుల ప్రణయ గీతం

దినేష్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. పాయల్‌ రాధాకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. మారేశ్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. బుధవారం ‘అలా నిన్ను చేరి’ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను దర్శకుడు క్రిష్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. చంద్రబోస్‌ సాహిత్యానికి సుభాష్‌ ఆనంద్‌ బాణీలు కట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ చిత్రమిది’ అన్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు

Updated Date - 2023-09-07T02:08:52+05:30 IST