సెట్లో రౌడీలా ఉండేదాన్ని
ABN , First Publish Date - 2023-05-07T03:40:01+05:30 IST
‘ఉప్పెన’తో ఒక్కసారిగా తుపాను వేగంతో దూసుకొచ్చింది కృతి శెట్టి. ఇప్పుడు టాలీవుడ్‌లోని బిజీ కథానాయికల్లో తన పేరు కూడా ఉంది. నాగచైతన్యతో కలిసి నటించిన ‘కస్టడీ’ మే 12న విడుదల అవుతోంది...

‘ఉప్పెన’తో ఒక్కసారిగా తుపాను వేగంతో దూసుకొచ్చింది కృతి శెట్టి. ఇప్పుడు టాలీవుడ్‌లోని బిజీ కథానాయికల్లో తన పేరు కూడా ఉంది. నాగచైతన్యతో కలిసి నటించిన ‘కస్టడీ’ మే 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సినిమాలోనూ విలన్‌ని చంపడానికే హీరో ప్రయత్నిస్తుంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం విలన్‌ని కాపాడడమే హీరో లక్ష్యం. కథానాయిక పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. ఇందులో నేను కొన్ని రిస్కీ యాక్షన్ సీన్లలో నటించాను. అండర్ వాటర్‌లో ఓ సీక్వెన్స్ ఉంది. అందుకోసం నేను జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకొన్నాను. నాగచైతన్యతో ఇది నా రెండో చిత్రం. ఆయన మంచి కో స్టార్ మాత్రమే కాదు. మంచి మనిషి కూడా. తోటి నటీనటులకు ఆయన కంఫర్ట్ ఇస్తారు. సెట్లో నేను ఓ రౌడీలా ఉండేదాన్నని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పేవారు. అవును.. నేను రౌడీనే. ఎదుటి వాళ్ల దగ్గర చనువు ఉంటే బాగా అల్లరి చేస్తుంటాను. ‘కస్టడీ’ సెట్లో నాకు అలాంటి వాతావరణమే కనిపించింది’’ అన్నారు. ఇటీవల తన చిత్రాలు కొన్ని పరాజయం పాలయ్యాయి. వాటిపై స్పందిస్తూ ‘‘హిట్ ఫార్ములా అనేది ఎవరికీ తెలీదు. అది తెలిస్తే.. అందరూ హిట్ సినిమాలే చేస్తారు. ‘ఉప్పెన’ తరవాత నాపై అంచనాలు పెరిగాయి. ఆ స్థాయి పాత్రలు తరవాత రాలేదు. కానీ ‘కస్టడీ’ మాత్రం నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’’ని తెలిపారు.