Allu Arjun: నా విజయానికి ఆయనే కారణం

ABN , First Publish Date - 2023-10-19T00:23:11+05:30 IST

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్‌ తెలిపారు. ‘పుష్ప’ చిత్ర దర్శకుడు సుకుమార్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు...

Allu Arjun: నా విజయానికి ఆయనే కారణం

ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్‌ తెలిపారు. ‘పుష్ప’ చిత్ర దర్శకుడు సుకుమార్‌కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు. ‘సుకుమార్‌ సార్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి ఆయనే కారణం’ అని పేర్కొన్నారు. తన ఆనందాన్ని బన్నీ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు సాధించిన ఘనత తనొక్కడిదే కాదన్నారు. సినిమాను ఆదరించినవారందరికీ ఈ గొప్పతనం దక్కుతుందని ఆయన చెప్పారు. తనకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన భారత ప్రభుత్వానికి, జ్యూరీకి ఆయన దన్యవాదాలు తెలిపారు. సంయుక్తంగా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న కృతీసనన్‌, అలియాభట్‌తో దిగిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న తర్వాత బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన అల్లు అర్జున్‌కు ఘన స్వాగతం లభించింది. అల్లు అర్జున్‌పై అభిమానులు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. బన్నీ ఇంటివద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2023-10-19T01:26:56+05:30 IST