స్పీడుమీదున్నాడు... బ్రో

ABN , First Publish Date - 2023-07-05T02:49:29+05:30 IST

కాలం చేసే ఇంద్రజాలం నేపథ్యంలో సాగే చిత్రం ‘బ్రో’. కాలానికి ప్రతినిధిలాంటి పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటించారు. సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రధారి. సముద్రఖని దర్శకుడు...

స్పీడుమీదున్నాడు...  బ్రో

కాలం చేసే ఇంద్రజాలం నేపథ్యంలో సాగే చిత్రం ‘బ్రో’. కాలానికి ప్రతినిధిలాంటి పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటించారు. సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రధారి. సముద్రఖని దర్శకుడు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాత. ఈనెల 28న విడుదల అవుతోంది. ఇటీవల టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ టీజర్‌ యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో ఈ చిత్రాన్ని పీపుల్‌ సినిమాస్‌ సంస్థ రిలీజ్‌ చేయనుంది. ‘‘పవన్‌ మార్క్‌ ఉన్న సినిమా ఇది. టీజర్‌, ప్రచార చిత్రాల్లో వింటేజ్‌ పవన్‌ కల్యాణ్‌ని చూసినట్టు ఉందని అభిమానులు ఆనందంగా ఉన్నారు. తెరపై పవన్‌ని చూస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేస్తామ’’ని నిర్మాత తెలిపారు. సంగీతం: తమన్‌, స్ర్కీన్‌ ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్‌.

Updated Date - 2023-11-17T08:24:21+05:30 IST