ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు
ABN , First Publish Date - 2023-08-09T04:07:17+05:30 IST
‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ‘పుష్ఫ’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు....

‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ‘పుష్ఫ’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు. మలయాళ నటుడే అయినా తెలుగులోనూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం రూపొందుతున్న ‘పుష్ప 2’లో ఆయన పాత్ర కీలకం కానుంది. మంగళవారం ఫహద్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది యూనిట్. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలి్‌షగా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఈసారి ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు’ అంటూ ఆ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్ సీక్వెల్ మీద అంచనాలు పెంచేశాయి. పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.