అతడొక అగ్నిగోళం
ABN , First Publish Date - 2023-04-17T03:54:29+05:30 IST
సూర్య కథానాయకుడిగా స్డూడియో గ్రీన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ దర్శకుడు. ఈ చిత్రానికి ‘కంగువ’ అనే పేరు ఖరారు చేశారు. ‘కంగువ’ అంటే.. అగ్ని లాంటి శక్తివంతమైన వ్యక్తి, లేదా అత్యంత...

సూర్య కథానాయకుడిగా స్డూడియో గ్రీన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ దర్శకుడు. ఈ చిత్రానికి ‘కంగువ’ అనే పేరు ఖరారు చేశారు. ‘కంగువ’ అంటే.. అగ్ని లాంటి శక్తివంతమైన వ్యక్తి, లేదా అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. ఈ కథకూ, ఇందులోని సూర్య పాత్రకూ తగిన పేరు ఇదే అని చిత్రబృందం తెలిపింది. దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2024 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయం కేటాయించాల్సివచ్చింది. సూర్య పాత్ర గంభీరంగా ఉంటుంది. ఆయనకు ఇది గుర్తుండిపోయే సినిమా. అభిమానులకు విజువల్ వండర్‌గా ఉంటుంద’’న్నారు శివ. సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.