మైఖేల్‌ లాంటి పాత్ర చేయలేదు

ABN , First Publish Date - 2023-02-03T01:39:10+05:30 IST

‘మైఖేల్‌’ కథకి, విజువల్‌ నేరెటివ్‌కి, సినిమాకీ పాన్‌ ఇండియా కెపాసిటీ ఉంది. విజువల్‌గా చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది...

మైఖేల్‌ లాంటి పాత్ర చేయలేదు

‘మైఖేల్‌’ కథకి, విజువల్‌ నేరెటివ్‌కి, సినిమాకీ పాన్‌ ఇండియా కెపాసిటీ ఉంది. విజువల్‌గా చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది.. యాక్షన్‌ ఫ్రెష్‌గా, రియలిస్టిక్‌ వైబ్‌తో ఉంటుంది’ అని చెప్పారు హీరో సందీప్‌ కిషన్‌. ఆయన నటించిన ‘మైఖేల్‌’’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్బంగా సందీప్‌ కిషన్‌ మీడియాతో మాట్లాడారు. ‘మైఖేల్‌ పాత్ర వైల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ కాకపోయినా చాలా ఎగ్రెసివ్‌, నెమ్మది కూడా. అతనికి ఫ్రెండ్స్‌ ఎవరూ ఉండరు, ఎవరితోనూ మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సయింటింగ్‌గా ఉంటాయి. ఇటువంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. దాదాపు 18 రోజుల పాటు వాటర్‌ తప్ప మరేమీ తీసుకోకుండా నటించాను. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించిన సినిమా ఇది. వృత్తిపరమైన సంతృప్తి ఉంది’ అన్నారు సందీప్‌. ఇది చాలా యూనిక్‌ స్టోరీ అని చెబుతూ ‘కథనం చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌ ఉంటాయి. సినిమాలో అందరూ బ్యాడ్‌ గయ్స్‌, బ్యాడ్‌ పీపుల్‌. ఇందులో డార్క్‌ కామెడీ కూడా ఉంటుంది.’ అన్నారు.

Updated Date - 2023-02-03T01:39:12+05:30 IST