పులుల్ని వేటాడే పులిని చూశావా?

ABN , First Publish Date - 2023-05-25T02:02:32+05:30 IST

‘జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్‌.. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా’’ అనే ఓ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో వచ్చేశాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.

పులుల్ని వేటాడే పులిని చూశావా?

‘‘జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావ్‌.. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా’’ అనే ఓ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో వచ్చేశాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహించారు. అక్టోబరు 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాజమండ్రిలో ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరించారు. ఫస్ట్‌ గ్లిమ్స్‌ని కూడా ఇదే సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌కు వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌. వాస్తవ ఘటనల్ని ఆధారంగా చేసుకొని, రియలిస్టిక్‌ పంథాలో తెరపైకి తీసుకొచ్చాం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్‌ సెట్‌ వేసి, అందులో ఓ పెద్ద పోరాట ఘట్టాన్ని చిత్రీకరించాం. అది ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ‘ధమాకా’ చిత్రానికి వంద కోట్లు వచ్చాయి. నేను వేయి కోట్లు రాబట్టాలంటే ఏం చేయాలో అవన్నీ చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా మా సంస్థకు చాలా ప్రత్యేకం. వంశీ ఈ ప్రాజెక్ట్‌ కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా కూడా బాగా వస్తోంది. అందుకే ప్రమోషన్లను కూడా వెరైటీగా ప్లాన్‌ చేశామ’’న్నారు నిర్మాత.


Updated Date - 2023-05-25T02:02:32+05:30 IST