శాకుంతలం కోసం శిక్షణ తీసుకున్నా

ABN , First Publish Date - 2023-01-09T00:19:20+05:30 IST

మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న సమంత ‘శాకుంతలం’ చిత్ర ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం...

శాకుంతలం కోసం శిక్షణ తీసుకున్నా

మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న సమంత ‘శాకుంతలం’ చిత్ర ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సమంత ‘శాకుంతలం’ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శకుంతల పాత్ర పోషణలో పరిపూర్ణత కోసం ఎలా శ్రమించారో వివరించారు. ‘ఈ చిత్రంలో నా పాత్రకు తనదైన హావభావాలు, భంగిమ ఉన్నాయి. సినిమా ఆద్యంతం అవి అలానే కొనసాగుతాయి. చిత్రీకరణ పూర్తయ్యేదాకా వాటిని అలానే అనుసరించడం కష్టంగా అనిపించింది. నడిచినా, మాట్లాడినా, పరుగెత్తినా, ఏడ్చినా... ఏం చేసినా ముఖంలో ఆ హావభావాలు ఏ మాత్రం మారకూడదు. దీంతో కష్టం అనిపించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను’ అని సమంత పేర్కొన్నారు. శకుంతల పాత్రకు సంబంధించిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2023-01-09T00:19:20+05:30 IST

Read more