తమన్నా... ప్రేమలో పడిందా?

ABN , First Publish Date - 2023-01-03T00:21:17+05:30 IST

చిత్రసీమలో ఇది మరో ప్రేమ కబురు. ప్రముఖ కథానాయిక తమన్నా ప్రేమలో పడిందంటూ సోషల్‌ మీడియా సాక్షిగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి...

తమన్నా... ప్రేమలో పడిందా?

చిత్రసీమలో ఇది మరో ప్రేమ కబురు. ప్రముఖ కథానాయిక తమన్నా ప్రేమలో పడిందంటూ సోషల్‌ మీడియా సాక్షిగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ నటుడు వినయ్‌ వర్మతో తమన్నా సన్నిహితంగా ఉంటోందని, ఇద్దరూ కలిసి గోవాలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది. ‘భాగి 3’, ‘డార్లింగ్స్‌’ చిత్రాలతో ఆకట్టుకొన్నాడు వినయ్‌ వర్మ. నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’లో ప్రతినాయకుడిగా నటించాడు. కొంతకాలంగా తమన్నా, వినయ్‌లు సన్నిహితంగా ఉంటున్నారని, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని టాక్‌. ఆ సాన్నిహిత్యంతోనే గోవాలో న్యూ ఇయర్‌ పార్టీ కూడా చేసుకొన్నార్ట. అయుతే ఈ వార్తలపై ఇప్పటి వరకూ తమన్నా, వినయ్‌లు స్పందించలేదు. తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఇటీవలే విడుదలైంది. ‘భోళా శంకర్‌’లో తను కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-03T00:21:20+05:30 IST