సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రుతి పెళ్లి కుదిరిందా..?

ABN, First Publish Date - 2023-01-27T04:58:02+05:30

ఈ యేడాది వరుస విజయాలతో శుభారంభం చేసింది శ్రుతిహాసన్‌. సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ రెండు చిత్రాల్లోనూ తనే కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ యేడాది వరుస విజయాలతో శుభారంభం చేసింది శ్రుతిహాసన్‌. సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ రెండు చిత్రాల్లోనూ తనే కథానాయిక. రాబోయే ‘సలార్‌’లోనూ మెరవబోతోంది. కెరీర్‌ పరంగా టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న శ్రుతి ఇప్పుడు జీవితంలోనూ స్థిరపడాలనుకొంటోంది. ఈ యేడాది శ్రుతి పెళ్లి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. తాను ప్రేమలో ఉన్నట్టు ఇది వరకే ప్రకటించింది. శాంతాను హజారికతో డేటింగ్‌ చేస్తోంది. ఆమధ్య ఇద్దరూ కలిసి విహార యాత్రలకూ వెళ్లొచ్చారు. ఈ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని శ్రుతి భావిస్తోందట. శ్రుతి వయసు ఇప్పుడు 36 ఏళ్లు. తనకంటే జూనియర్లు పెళ్లి చేసుకొని సెటిలైపోతున్నారు. అందుకే శ్రుతి ఈ నిర్ణయం తీసుకొందట. పెళ్లయినా సినిమాలు చేసేలా.. కెరీర్‌ ప్లాన్‌ చేసుకొంటోందట. శ్రుతి ప్రేమ వ్యవహారం ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్లు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, అందుకే పెళ్లికి త్వరపడుతోందని టాక్‌.

Updated Date - 2023-01-27T04:58:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!