Hamma.. Hamma.. I like the baby! : హమ్మా.. హమ్మా.. పిల్ల నచ్చిందమ్మా!
ABN , First Publish Date - 2023-10-29T05:44:43+05:30 IST
సందీప్ కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ కథానాయిక. కావ్య ధాపర్ కీలక పాత్రధారి...

సందీప్ కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వర్ష బొల్లమ్మ కథానాయిక. కావ్య ధాపర్ కీలక పాత్రధారి. అనిల్ సుంకర నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘హమ్మా.. హమ్మా’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. శేఖర్ చంద్ర, తిరుపతి జవానా సాహిత్యం అందించారు. రామ్ మరియాల ఆలపించారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ‘‘సాహసోపేతమైన థ్రిల్లర్ ఇది. తొలి పాట ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాటకు మంచి స్పందన వచ్చింది. ‘హమ్మా..’ కూడా అదే స్థాయిలో ఉంది. మిగిలిన పాటలూ ఆకట్టుకొంటాయి. త్వరలోనే విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత.