యాక్షన్‌ హంగామా

ABN , First Publish Date - 2023-01-10T00:10:09+05:30 IST

‘మేజర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో కథానాయకుడిగా సత్తా చాటారు అడివిశేష్‌. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ తెరకెక్కుతోంది.

యాక్షన్‌ హంగామా

‘మేజర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో కథానాయకుడిగా సత్తా చాటారు అడివిశేష్‌. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ తెరకెక్కుతోంది. అడివిశేష్‌ కథను అందిస్తున్నారు. ‘మేజర్‌’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్‌ సిరిగినీడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ముంబైలో ‘గూఢచారి 2’ ఫస్ట్‌లుక్‌ను, ప్రీవిజన్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. గూఢచారి పాత్రలో శేష్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. యాక్షన్‌ సన్నివేశాలు భారీస్థాయిలో ఉన్నాయి. మేకింగ్‌ పరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

Updated Date - 2023-01-10T00:10:09+05:30 IST