అమ్మాయిలకు బాగా నచ్చుతుంది

ABN , First Publish Date - 2023-08-10T04:33:41+05:30 IST

శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా ఫణిదీప్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉస్తాద్‌’. ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక కావ్యా కల్యాణ్‌రామ్‌ సినిమా విశేషాలను మీడియాతో...

అమ్మాయిలకు బాగా నచ్చుతుంది

శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా ఫణిదీప్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉస్తాద్‌’. ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక కావ్యా కల్యాణ్‌రామ్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • రజనీకాంత్‌ ‘జైలర్‌’, చిరంజీవి ‘భోళాశంకర్‌’ చిత్రాలతో పాటు మా ‘ఉస్తాద్‌’ సినిమా విడుదలవుతోంది. పెద్ద సినిమాలతో పాటు విడుదలవుతున్నా, కంటెంట్‌పైన చాలా నమ్మకంగా ఉన్నాం. ‘ఉస్తాద్‌’ మాకు బాగా నచ్చింది. జనాలకూ నచ్చుతుందనే నమ్మకం ఉంది.

  • హీరో తన బైక్‌ను ‘ఉస్తాద్‌’ అని పిలుస్తాడు. తను పైలట్‌గా జాబ్‌ సంపాదించడం అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. యువతకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. హీరో ప్రియురాలు మేఘన పాత్ర పోషించాను. అనుకున్నది ఎంత కష్టమైనా సాధించగలిగే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అమ్మాయిలకు నా పాత్ర బాగా నచ్చుతుంది.

  • దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఆయన వ్యాఖ్యానంతోనే ‘ఉస్తాద్‌’ చిత్రం మొదలవుతుంది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు రావు అనుకోవడం నిజం కాదు. శ్రీదేవి, సావిత్రి ఇతర భాషల్లోనూ గొప్ప కథానాయికలుగా రాణించారు కదా!.

Updated Date - 2023-08-10T04:33:41+05:30 IST