రిలీజ్‌కు గురి పెట్టిన ‘ఘోస్ట్‌’

ABN , First Publish Date - 2023-08-26T05:13:24+05:30 IST

కన్నడనటుడు శివరాజ్‌కుమార్‌ నటించిన ‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 19న విడుదల కానుంది...

రిలీజ్‌కు గురి పెట్టిన ‘ఘోస్ట్‌’

కన్నడనటుడు శివరాజ్‌కుమార్‌ నటించిన ‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 19న విడుదల కానుంది. శివరాజ్‌కుమార్‌ సీరియస్‌ లుక్‌తో ఉన్న రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. శ్రీని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సదేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌, ప్రశాంత్‌ నారాయణ్‌, అర్చన జాయిస్‌, పత్యప్రకాశ్‌ దత్తన్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-08-26T05:13:24+05:30 IST