యానిమల్‌లో గీతాంజలి

ABN , First Publish Date - 2023-09-24T02:20:59+05:30 IST

రణబీర్‌ కపూర్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ఈ చిత్రంలో రణబీర్‌కి జోడీగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే...

యానిమల్‌లో గీతాంజలి

రణబీర్‌ కపూర్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ఈ చిత్రంలో రణబీర్‌కి జోడీగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. గీతాంజలి పాత్రలో ఆమె ఫస్ట్‌ లుక్‌ని శనివారం చిత్రబృందం విడుదల చేసింది. చీర కట్టు, నుదుటిపై బొట్టుతో రష్మిక లుక్‌ సంప్రదాయబద్ధంగా ఉంది. ‘‘సందీప్‌ రెడ్డి కథలో గొప్ప ఎమోషన్‌ మాత్రమే కాదు. చక్కటి ప్రేమకథ కూడా ఉంటుంది. ఈ సినిమాలోనూ లవ్‌ స్టోరీ ఆకట్టుకొంటుంది. గీతాంజలి పాత్రలో రష్మిక ఒదిగిపోయింద’’ని చిత్ర బృందం తెలిపింది. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషించారు. ఈనెల 28న టీజర్‌ విడుదల చేస్తారు.

Updated Date - 2023-09-24T02:20:59+05:30 IST