Ganḍhivadhari arjuna : అర్జున పోరాటం

ABN , First Publish Date - 2023-07-25T03:11:56+05:30 IST

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత.

Ganḍhivadhari arjuna : అర్జున పోరాటం

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఆగస్టు 25న విడుదల కానుంది. సోమవారం టీజర్‌ బయటకు వచ్చింది. టీజర్‌లో యాక్షన్‌ దృశ్యాలు ఆకట్టుకొన్నాయి. ‘‘దేశ రక్షణకు సంబంధించిన ఓ పెద్ద సమస్యని కథానాయకుడు ఎలా పరిష్కరించాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. అసలు ఆ పరిస్థితులు ఎవరి వల్ల వచ్చాయి? ఈ ప్రయాణంలో కథానాయకుడికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులేంటి? అనేది తెరపై చూడాల్సిందే’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: మిక్కీజే.మేయర్‌.

Updated Date - 2023-07-25T03:12:01+05:30 IST