కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మార్చిలో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

ABN, First Publish Date - 2023-11-28T06:10:46+05:30

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహా శెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది...

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. నేహా శెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వచ్చే యేడాది మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటిచింది. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ యువకుడి కథ ఇది. గోదావరి నేపథ్యంలో సాగుతుంది. అక్కడ జరిగే చీకటి వ్యాపారాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చే ఓ ఫిక్షన్‌ స్టోరీ ఇది. యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన తొలి గీతానికి మంచి స్పందన వస్తోంద’’న్నారు నిర్మాతలు.

Updated Date - 2023-11-28T06:10:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!