జీరో బడ్జెట్‌తో ‘గండ’

ABN , First Publish Date - 2023-05-25T01:51:05+05:30 IST

వారణాసి సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గండ’. జీరో బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. టీజర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో

జీరో బడ్జెట్‌తో ‘గండ’

వారణాసి సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గండ’. జీరో బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. టీజర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత శివశక్తి దత్తా విడుదల చేశారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో తీసిన సినిమా ఇది. ఆయన జీరో బడ్జెట్‌తో రాజకీయాలు చేస్తున్నారు. నేను సినిమా ఎందుకు తీయకూడదు? అనుకొన్నా. అందుకోసం ఐదేళ్ల పాటు శ్రమించాను. అంతా కొత్తవాళ్లతోనే చేసిన ప్రయోగం ఇద’’న్నారు. ‘‘జీరో బడ్జెట్‌తో సినిమా తీశాడని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆ తరవాత చాలా ఆనందం కలిగింది. ఇలాంటి ప్రయత్నాలు మున్ముందు మరిన్ని జరగాలంటే ఈ చిత్రం విజయవంతం కావాల’’న్నారు శివశక్తి దత్తా.


Updated Date - 2023-05-25T01:51:05+05:30 IST