గల గల పారే ఏరులా...

ABN , First Publish Date - 2023-04-21T01:44:03+05:30 IST

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోశ్‌ శోభన్‌ కథానాయకుడు. మాళవిక నాయర్‌ కథానాయిక. స్వప్న సినిమాస్‌ పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మించారు...

గల గల పారే ఏరులా...

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోశ్‌ శోభన్‌ కథానాయకుడు. మాళవిక నాయర్‌ కథానాయిక. స్వప్న సినిమాస్‌ పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మించారు. మే 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. గురువారం ఈ చిత్రం నుంచి ‘గల గల ఏరులా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. రెహమాన్‌ రాసిన గీతమిది. మిక్కీ జే.మేయర్‌ స్వరాలు అందించారు. రకుల్‌, రమ్యభట్‌ ఆలపించారు. ‘‘ఇటలీలోని అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన గీతమిది. హృద్యంగా సాగిపోయే ఈ పాటలో హీరో, హీరోయిన్ల కెమిస్ర్టీ చక్కగా కుదిరింది. ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ సినిమా ఈ వేసవిలో చిరుజల్లులా హాయినిస్తుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-04-21T01:44:03+05:30 IST