వృషభ కోసం హాలీవుడ్‌ నుంచి

ABN , First Publish Date - 2023-08-08T03:44:04+05:30 IST

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. అదే ‘వృషభ’. మోహన్‌లాల్‌ కీలక పాత్రధారి. శనయ కపూర్‌, జహ్రాఖాన్‌ కీలక పాత్రధారులు...

వృషభ కోసం హాలీవుడ్‌ నుంచి

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. అదే ‘వృషభ’. మోహన్‌లాల్‌ కీలక పాత్రధారి. శనయ కపూర్‌, జహ్రాఖాన్‌ కీలక పాత్రధారులు. ఈ ప్రాజెక్టులో హాలీవుడ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌ నిక్‌ తుర్లో భాగస్వామి అయ్యారు. ‘మూన్‌ లైట్‌’, ‘మిస్సోరి’ లాంటి ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలకు పని చేశారు నిక్‌. ఆయన రాకతో.. ‘వృషభ’ టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘‘ఇది నా మొదటి భారతీయ చిత్రం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంద’’ంటూ సంతోషం వ్యక్తం చేశారు నిక్‌. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఇది. నిక్‌ రాకతో ఈ సినిమా స్థాయి పెరిగింద’’ని నిర్మాత విశాల్‌ గుర్నాని తెలిపారు.

Updated Date - 2023-08-08T03:44:04+05:30 IST