భయపెట్టే ‘భూ’
ABN , First Publish Date - 2023-05-24T01:46:42+05:30 IST
విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్‌సింగ్, వివేదా పేరురాజ్, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన హారర్ మూవీ ‘భూ’ ఈ నెల 27న ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది...

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్‌సింగ్, వివేదా పేరురాజ్, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన హారర్ మూవీ ‘భూ’ ఈ నెల 27న ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు విజయ్ తెరకెక్కించారు. జవ్వాజీ రామాంజనేయులు, ఎం.రాజశేఖరెడ్డి నిర్మించారు. ‘మా సినిమా ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. దర్శకుడు విజయ్ ఆసక్తికరంగా చిత్రీకరించారు’ అని వారు తెలిపారు.