పద్నాలుగు రోజుల ప్రేమ

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:48 AM

మనోజ్‌ పుట్టూర్‌, చాందినీ భాగవని జంటగా రూపుదిద్దుకున్న ‘14 డేస్‌ లవ్‌’ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. నాగరాజు బోడెం దర్శకత్వంలో హరిబాబు దాసరి ఈ చిత్రం నిర్మించారు...

పద్నాలుగు రోజుల ప్రేమ

మనోజ్‌ పుట్టూర్‌, చాందినీ భాగవని జంటగా రూపుదిద్దుకున్న ‘14 డేస్‌ లవ్‌’ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. నాగరాజు బోడెం దర్శకత్వంలో హరిబాబు దాసరి ఈ చిత్రం నిర్మించారు. ‘కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, ఓ యువ జంట మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అనే అంశాలను ఆసక్తికరంగా చిత్రీకరించాం’ అని దర్శకుడు వివరించారు. రాజా రవీంద్ర, సనా సునూర్‌, అంజలి, రాజా శ్రీధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: గౌరీశ్వర్‌ శివప్రసాద్‌ సామల, ఛాయాగ్రహణం: కన్నన్‌ మునస్వామి, సంగీతం: కిరణ్‌ వెన్న, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రకళ దాసరి, సహ నిర్మాత: ఎ.వేణు.

Updated Date - Dec 31 , 2023 | 04:48 AM