అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ రమణ అభినందనలు

ABN , First Publish Date - 2023-08-28T01:31:09+05:30 IST

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌కు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా రంగం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి కథానాయకుడిగా అల్లు అర్జున్‌...

అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ రమణ అభినందనలు

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌కు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా రంగం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి కథానాయకుడిగా అల్లు అర్జున్‌ తన తాత, తండ్రి, మామలతో పాటు తెలుగు సినిమా కీర్తికి మరింత వన్నె తెచ్చారని జస్టిస్‌ రమణ కొనియాడారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వైభవ పతాకాన్ని రెపరెపలాడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గర్వపడేలా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇష్టంతో కష్టపడి ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప’ వరకూ ఇంతింతై వటుడింతై అన్నట్లు అర్జున్‌ ఎదిగిన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అల్లు రామలింగయ్య వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమను అల్లుకున్న తీరు అబ్బురమని కొనియాడారు. నాట్యంలో, నటనలో రాణించి ఆ అర్జునుడిలా సవ్యసాచిగా నిరూపించుకున్న అర్జున్‌కు అభినందలు అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి, అమరావతి

Updated Date - 2023-08-28T01:31:09+05:30 IST