ఆ కష్టమంతా మరచిపోయా

ABN , First Publish Date - 2023-11-22T00:17:44+05:30 IST

‘జెన్యూన్‌ ఫిమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సినిమాకు వస్తున్న టాక్‌ విని...

ఆ కష్టమంతా మరచిపోయా

‘జెన్యూన్‌ ఫిమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సినిమాకు వస్తున్న టాక్‌ విని ఆ కష్టమంతా మరిచిపోయాం. ఇటువంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నిర్మాత కూడా ఒక విజయవంతమైన చిత్రాన్ని తీయాలని ఎంతో తపన పడ్డారు’ అన్నారు హన్సిక. ఈ నెల 17న విడుదలైన ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘స్కిన్‌ మాఫియా నేపథ్యంలో నిర్మించిన మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఙతలు. అనారోగ్యంతో ఉండి కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హన్సిక గారికి ధన్యవాదాలు’ అన్నారు. ‘ఒక కొత్త దర్శకుడిని కొత్త నిర్మాత నమ్మడం మాములు విషయం కాదు. ఈ కథ చెప్పే ముందు తన బెస్ట్‌ టెన్‌ ఫిల్మ్స్‌లో ఈ సినిమా ఉంటుందని హన్సికగారికి చెప్పాను. నా ప్రామిస్‌ నిలటెట్టుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌.

Updated Date - 2023-11-22T00:17:47+05:30 IST