టైగర్ రాక కోసం
ABN , First Publish Date - 2023-08-29T03:11:22+05:30 IST
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబరు 20న విడుదల కానుంది...

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి కథానాయిక నూపుర్ సనన్ ఫస్ట్ లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఆమె సారా పాత్రలో కనిపించనుంది. రైల్లో కిటికీ సీటులో కూర్చుని, తన ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది సారా లుక్. ఇందులో మరో కథానాయికగా గాయత్రి భరద్వాజ్ కనిపించనుంది. తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సైతం త్వరలో విడుదల చేస్తారు. ‘‘రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్.