దసరా పండక్కి... రామ్‌ జాతర

ABN , First Publish Date - 2023-03-28T03:36:14+05:30 IST

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు...

దసరా పండక్కి... రామ్‌ జాతర

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సోమవారం రామ్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. జాతర నేపథ్యంలో రామ్‌ ఓ భారీ యాక్షన్‌ సన్నివేశానికి సిద్ధమవుతున్నట్టున్న పోస్టర్‌ అది. రామ్‌ లుక్‌.. మాసీగా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Updated Date - 2023-03-28T03:36:17+05:30 IST