నా పేరుతో మొదటి పాట

ABN , First Publish Date - 2023-10-26T01:52:52+05:30 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రంలోని మూడో పాట ‘లీలమ్మో’ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు కాసర్ల శ్యామ్‌...

నా పేరుతో మొదటి పాట

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రంలోని మూడో పాట ‘లీలమ్మో’ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను నకాశ్‌ అజీజ్‌, ఇంద్రావతి చౌహాన్‌ పాడారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీత దర్శకుడు. పాట విడుదల సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘మా సినిమా షూటింగ్‌ జరుగుతున్నంత కాలం కళకళలాడుతూ ఉండేది. ఇక శ్రీలీల, సుదర్శన్‌గారు సెట్‌లో ఉంటే చెప్పనక్కర్లేదు. ఎంతో సరదాగా షూటింగ్‌ గడిచింది’ అన్నారు. ‘అమ్మవారి దసరా పండగ అయిపోయింది. నవంబర్‌ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుంది. ఇందులో ‘లీలమ్మో’ పాటు నాకు ఎంతో ఇష్టం. నా పేరుతో వస్తున్న మొదటి పాట ఇది. అందుకే నాకు మరింత ప్రత్యేకం. వైష్ణవ్‌గారు అద్భుతంగా డాన్స్‌ చేశారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ బాగుంది. ఇది పర్‌పెక్ట్‌ మాస్‌ సాంగ్‌. వినగానే నాకు స్నేక్‌ డాన్స్‌ చేయాలనిపించింది.’ అన్నారు శ్రీలీల. చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ ‘సినిమాలో ఫస్ట్‌ హాఫ్‌ అంతా వైష్ణవ్‌, శ్రీలీల, సుదర్శన్‌లతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో యాక్షన్‌ ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Updated Date - 2023-10-26T01:52:52+05:30 IST