సినిమా షూటింగ్‌ హార్డ్‌డిస్క్‌ ఇవ్వకుండా వేధింపులు

ABN , First Publish Date - 2023-09-05T02:07:11+05:30 IST

సినిమా షూటింగ్‌కు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఫొటోగ్రాఫర్‌పై నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫొటోగ్రాఫర్‌పై బెంగళూరు నగరం చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు...

సినిమా షూటింగ్‌ హార్డ్‌డిస్క్‌ ఇవ్వకుండా వేధింపులు

సినిమా షూటింగ్‌కు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఫొటోగ్రాఫర్‌పై నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫొటోగ్రాఫర్‌పై బెంగళూరు నగరం చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనితాభట్‌ ప్రధానపాత్రలో సముద్రం అనే సినిమాను రాజ్యలక్ష్మి సినీ క్రియేషన్స్‌ నిర్మించింది. సినిమాకు రాజ్యలక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాకు సంగీతం, డబ్బింగ్‌, రీ రికార్డింగ్‌, ఎడిటింగ్‌తోపాటు కీలకమైన బాధ్యతలను ఫొటోగ్రాఫర్‌ రిషికేశ్‌ తీసుకున్నాడు. నిర్మాత నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.19 లక్షల నగదు పొందాడు. సినిమా షూటింగ్‌ సగం జరిగాక రిషికేశ్‌ సినిమా వ్యవహారాలకు దూరమయ్యాడు. తాను సూచించినవారిని సహాయ నిర్మాతగా చేర్చుకోవాలని, లేదంటే షూటింగ్‌ చేసిన హార్డ్‌డిస్క్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ వివాదం పది నెలలుగా సాగుతోంది. హార్డ్‌డిస్క్‌ ఇవ్వకుండా రిషికేశ్‌ వేధిస్తున్నాడని, ఫోన్‌ చేస్తే బూతులు తిడుతున్నాడని, ప్రాణాలు తీస్తానని బెదరిస్తున్నాడని నిర్మాత రాజ్యలక్ష్మి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-09-05T02:07:11+05:30 IST