సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pedada Murthy :ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, గీత రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూత

ABN, First Publish Date - 2023-01-04T04:09:41+05:30

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, గీత రచయిత పెద్దాడ మూర్తి (51) మంగళవారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, గీత రచయిత పెద్దాడ మూర్తి (51) మంగళవారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దాడ మూర్తి స్వస్థలం భీమునిపట్నం. ఆయన తండ్రి వీరభద్రరావు తెలుగు లెక్చరర్‌. మూర్తి సోదరులు ఇద్దరూ రచయితలే. వేటూరి అంటే పెద్దాడ మూర్తికి ఎంతో అభిమానం. తను అలా గీత రచయిత కావాలనే అభిప్రాయంతో హైదరాబాద్‌ వచ్చారు. జ్యోతిచిత్ర, ఆంధ్రభూమి, శివరంజని, సూపర్‌హిట్‌ పత్రికల్లో ఫిల్మ్‌ జర్నలిస్టుగా పనిచేసిన మూర్తి ‘కూతురు’ చిత్రంతో పాటల రచయితగా మారారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘చందమామ’ చిత్రంలోని పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అలాగే చిరంజీవి స్టాలిన్‌ సినిమాలో మూర్తి రాసిన ‘సిగ్గుతో చీ చీ’ పాట కూడా బాగా పాపులర్‌ అయింది,. వీటితో పాటు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయు’, ‘ఇడియట్‌’’ , ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘కౌసల్య సుప్రజ రామా’, తదితర చిత్రాల్లో పాటలు రాశారు. భరత్‌ పారేపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘నాగలి’ మూర్తి చివరి చిత్రం. ఈ చిత్రానికి ఆయన మాటలు, పాటలు రాశారు. బుధవారం పెద్దాడ మూర్తి అంత్యక్రియలు జరుగుతాయి.

Updated Date - 2023-01-04T10:20:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!