సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫైటర్స్‌ యూనియన్‌, నిర్మాతలు కలసి పనిచేయాలి

ABN, First Publish Date - 2023-02-14T03:11:43+05:30

టాలీవుడ్‌ ఫైటర్స్‌ యూనియన్‌ పట్టుదలకు పోకుండా నిర్మాతలతో కలసి పనిచేయాలని ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి

టాలీవుడ్‌ ఫైటర్స్‌ యూనియన్‌ పట్టుదలకు పోకుండా నిర్మాతలతో కలసి పనిచేయాలని ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి కోరారు. పెద్ద నిర్మాణ సంస్థలు తాము నిర్మించే చిత్రాల్లో విదేశీ ఫైట్‌మాస్టర్లను తీసుకోవడంపై టాలీవుడ్‌ ఫైటర్స్‌ యూనియన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది యూనియన్‌ నిబంధనల ప్రకారం నిర్మాతలు నడుచుకునేలా చూడాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ను కోరింది. దీనికి నిర్మాతలు సుముఖంగా లేరు. దీంతో ఫైటర్స్‌ యూనియన్‌ నాయకులు, నిర్మాతల తో ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి చర్చలు జరిపారు. రొటేషన్‌ విధానంలో సినిమాలకు ఫైట్‌ మాస్టర్లను పంపిస్తామనడం భావ్యం కాదన్నారు. ఇలా చేయడం ద్వారా ఫైటర్స్‌ యూనియన్‌ ఛాంబర్‌కు ఇచ్చిన మాట తప్పినట్లవుతుందని ఆక్షేపించారు. ఫైటర్స్‌ యూనియన్‌ నిర్మాతలతో కలసి పనిచేస్తే చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.

Updated Date - 2023-02-14T03:11:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!