యాభై ఏళ్ల పరువం

ABN , First Publish Date - 2023-11-02T02:42:33+05:30 IST

భారతీయ చిత్ర సీమలో అందానికి చిరునామాగా నిలిచిన అతికొద్దిమంది తారల్లో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ఒకరు. మాజీ విశ్వసుందరిగా, బాలీవుడ్‌ అందాల తారగా కోట్లాది మంది...

యాభై ఏళ్ల పరువం

భారతీయ చిత్ర సీమలో అందానికి చిరునామాగా నిలిచిన అతికొద్దిమంది తారల్లో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ఒకరు. మాజీ విశ్వసుందరిగా, బాలీవుడ్‌ అందాల తారగా కోట్లాది మంది యువత కలలసుందరిగా ఆమె ప్రయాణం అనన్యసామాన్యం. బుధవారం ఐశ్వర్య 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని సినీ సెలబ్రిటీలతో ఆర్భాటంగా చేసుకోకుండా కాక ఒక మంచి పనికోసం ఉపయోగించుకున్నారు. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేన్సర్‌ పేషంట్లతో కలసి తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. తల్లి వ్రిందా రాయ్‌, కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలసి కేక్‌ కట్‌ చేశారు. కర్వాచౌత్‌ సందర్భంగా ఉపవాసంతో ఉండడం వల్ల బర్త్‌డే కేక్‌ను ఐశ్వర్య రుచి చూడలేదు.

Updated Date - 2023-11-02T02:42:33+05:30 IST