ప్రేమకు ఫిదా
ABN , First Publish Date - 2023-10-12T03:21:56+05:30 IST
కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లింగోచ్చా’. సుప్యర్ద సింగ్ హీరోయిన్. ఆనంద్ బడా దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లింగోచ్చా’. సుప్యర్ద సింగ్ హీరోయిన్. ఆనంద్ బడా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాదగిరి రాజు నిర్మాత. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ‘ఫిదా’ అంటూ సాగే ప్రేమగీతాన్ని చిత్రబృందం బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నిర్మాతల సహకారం వల్ల సినిమాను చాలా గ్రాండ్‌గా తీశాం. కార్తీక్ రత్నాన్ని కొత్తగా చూపిస్తున్నాం’ అన్నారు. ఆనంద్ కొత్తవాడైనా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా తీశాడు, ‘లింగోచ్చా’ ఘన విజయం సాధిస్తుందని కార్తీక్‌రత్నం తెలిపారు.