కథను నమ్ముకుని తీసిన అల్లంత దూరాన
ABN , First Publish Date - 2023-02-10T00:16:22+05:30 IST
కథను నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించిన విజువల్ ఫీస్ట్ ‘అల్లంత దూరాన’ అని చెప్పారు...

కథను నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించిన విజువల్ ఫీస్ట్ ‘అల్లంత దూరాన’ అని చెప్పారు హాస్య నటుడు ఆలీ. విశ్వ కార్తికేయ, నటి ఆమని మేనకోడలు హ్రితికా శ్రీనివాస్ జంటగా ఈ చిత్రంలో నటించారు. చలపతి పువ్వుల దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను అలీ ఆవిప్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్ చూడగానే కళా తపస్వి కె.విశ్వనాథ్ , ఆయన చిత్రాలు గుర్తుకు వచ్చాయి’ అన్నారు. ‘ఒక మంచి ప్రేమకథాచిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో ‘అల్లంత దూరాన’ చిత్రం తీశాను. ప్రతి ప్రేక్షకుడు మెచ్చుకొనే విదంగా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు నిర్మాత చంద్రమోహన్ రెడ్డి. ‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. సీనియర్ ఆర్టిస్టులు నటించారు’ అని దర్శకుడు చలపతి తెలిపారు. ‘మనసుకు హత్తుకొనేలా ఈ సినిమా ఉంటుంది. కథలోని కొత్తదనం నచ్చే ఈ సినిమా చేశాం. రథన్ సంగీతం, కల్యాణ్ ఛాయాగ్రహణం అలరిస్తాయి’ అని హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ హృతికా శ్రీనివాస్ చెప్పారు.