Devil : దూరమే తీరమై

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:48 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన పీరియాడిక్‌ డ్రామా ‘డెవిల్‌’ ఈ నెల 29న విడుదల కానుంది. బ్రిటీషర్లు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రం కావడంతో...

Devil : దూరమే తీరమై

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన పీరియాడిక్‌ డ్రామా ‘డెవిల్‌’ ఈ నెల 29న విడుదల కానుంది. బ్రిటీషర్లు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రం కావడంతో నాటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని తెరపై ఆవిష్కరిస్తూ భారీగా చిత్రాన్ని నిర్మించారు దర్శకనిర్మాత అభిషేక్‌ నామా. ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీషు సీక్రెట్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ నటించారు. ‘బింబిసార’ చిత్రంతో బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన ఆయన ‘డెవిల్‌’తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. మాళవికా మోహనన్‌, సంయుక్తా మీనన్‌ ఈ చిత్ర కథానాయికలు. తాజాగా ఈ మూవీ నుంచి ‘దూరమే తీరమై’ అనే లిరికల్‌ వీడియో విడుదల చేశారు. సమీర భరద్వాజ్‌ ఈ పాట రాసి, పాడడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ‘డెవిల్‌’ను విడుదల చేస్తున్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:48 AM