ఫ్యామిలీ పార్టీ

ABN , First Publish Date - 2023-11-19T02:28:40+05:30 IST

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సౌండ్‌ పార్టీ’. సంజయ్‌ శేరి దర్శకుడు. జయశంకర్‌ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌గజేంద్ర నిర్మించారు...

ఫ్యామిలీ పార్టీ

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సౌండ్‌ పార్టీ’. సంజయ్‌ శేరి దర్శకుడు. జయశంకర్‌ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌గజేంద్ర నిర్మించారు. ఈ నెల 24న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. విజే సన్నీ, శివన్నారాయణ మధ్య పంచ్‌ డైలాగ్‌లు, సప్తగిరి కామెడీతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ‘సౌండ్‌ పార్టీ’లో ఉన్నాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మోహిత్‌ రెహమానిక్‌. సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌రెడ్డి

Updated Date - 2023-11-19T02:28:43+05:30 IST