ప్రయోగాత్మక ‘క్యాప్చర్‌’

ABN , First Publish Date - 2023-11-14T04:27:52+05:30 IST

కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర భార్య ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంతవరకూ సినీ ప్రపంచంలో రానటువంటి ప్రయోగాత్మక చిత్రం ఇది...

ప్రయోగాత్మక ‘క్యాప్చర్‌’

కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర భార్య ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంతవరకూ సినీ ప్రపంచంలో రానటువంటి ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్‌ లెన్స్‌తో తీసిన తొలి సినిమా కూడా ఇదే’ అన్నారు దర్శకుడు లోహిత్‌ హెఛ్‌. ఆయన రూపొందిస్తున్న మూడో ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్‌’. రాదికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం గోవాలో 30 రోజుల పాటు జరిగింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ ను విడుదల చేశారు. ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తయారవుతోందని ఈ పోస్టర్‌ను చూస్తే అర్ధమవుతుంది

Updated Date - 2023-11-14T04:27:54+05:30 IST