అంతా కొత్తవారితో బలగం
ABN , First Publish Date - 2023-02-21T01:57:48+05:30 IST
దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించి, వీలైనంతవరకూ కొత్త ఆర్టిస్టులను, టెక్నీఫియన్లను పరిచయం చేయాలనుకున్నాం. ఆ సమయంలో వేణు నా దగ్గరికి వచ్చాడు...

దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించి, వీలైనంతవరకూ కొత్త ఆర్టిస్టులను, టెక్నీఫియన్లను పరిచయం చేయాలనుకున్నాం. ఆ సమయంలో వేణు నా దగ్గరికి వచ్చాడు. ఏ పాత్ర ఎలా ఉండాలి, ఎవరు నటించాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా వేణు దర్శకుడిగా ‘బలగం’ చిత్రం మొదలైంది’ అన్నారు దిల్ రాజు. హాస్య నటుడు వేణు ఎల్లండిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన ‘బలగం’ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘ ముగ్గురు, నలుగురు తప్ప దాదాపు అంతా కొత్తవారినే తీసుకున్నాం. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లు. ‘డీజె టిల్లు’తో గుర్తింపు పొందిన మురళీధర్ హీరోయిన్ తండ్రిగా, విజయలక్ష్మి హీరో మేనత్తగా , హీరో తండ్రిగా ఐలయ్య నటించారు. తెలంగాణకు చెందిన పల్లెటూరిలో జరిగే కథ ఇది. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి ధన్యవాదాలు. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాశారు. భీమ్స్ సిసిరోలియో చక్కని బాణీలు ఇచ్చారు’ అని తెలిపారు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు.