పులికి అందరూ సలాం కొడతారు

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:28 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది...

పులికి అందరూ సలాం కొడతారు

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్‌ అప్‌డేట్‌ను సంగీత దర్శకుడు అనిరుద్‌ వెల్లడించారు. ‘దేవర’ చిత్రం టీజర్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు బుధవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘పులికి అందరూ సలాం కొడతారు’ అంటూ ఆయన టీజర్‌పై అంచనాలు పెంచారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated Date - Dec 28 , 2023 | 01:28 AM