సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మైఖేల్‌ అందరికీ నచ్చేస్తాడు!

ABN, First Publish Date - 2023-01-29T01:19:32+05:30

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మైఖేల్‌’. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌మీనన్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మైఖేల్‌’. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌మీనన్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషించారు. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మాతలు. ఫిబ్రవరి 3న విడుదల కానుంది. శనివారం ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో మైఖేల్‌ చాలా ప్రత్యేకమైన చిత్రం. చాలామంది ప్రతిభావంతులు ఈ సినిమా కోసం ఓ టీమ్‌గా కష్టపడ్డారు. మేం కథని, దర్శకుడ్ని బలంగా నమ్మాం. మా నమ్మకం నిజమవుతుంది. మా ‘మైఖేల్‌’ అందరికీ నచ్చుతాడ’’న్నారు. ‘‘ఇంత పెద్ద సినిమాలో భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘మైఖేల్‌’ కోసం సందీప్‌ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తరవాత బిగ్‌ లీగ్‌లోకి చేరతాడ’’న్నారు వరుణ్‌ సందేశ్‌. ‘‘తమిళంలో మూడు సినిమాలు చేశాను. తెలుగులో ఇదే తొలి చిత్రం. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. నిర్మాతల సహకారంతోనే ఈ సినిమాని ఈ స్థాయిలో తెరకెక్కించే అవకాశం దక్కింద’’న్నారు దర్శకుడు. ‘‘టీజర్‌, ట్రైలర్‌, పాటలతో ఈ సినిమా క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అంచనాలు భారీగా పెరిగాయి. వాటిని తప్పకుండా అందుకొంటామ’’ని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-29T01:19:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!