ప్రతి సీన్‌కీ ఓ లాజిక్ ఉంది
ABN , First Publish Date - 2023-10-08T02:45:13+05:30 IST
‘‘కథని చెప్పడంలో ఒకొక్కరిదీ ఒక్కో పంథా. న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ అనేది.. ‘మంత్ ఆఫ్ మధు’తో ప్రయత్నించాం, ఇందులో ప్రతి సీన్‌కీ ఓ లాజిక్ ఉంది’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. ఆయన దర్శకత్వం వహించిన ‘మంత్ ఆఫ్ మధు’ ...
‘‘కథని చెప్పడంలో ఒకొక్కరిదీ ఒక్కో పంథా. న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ అనేది.. ‘మంత్ ఆఫ్ మధు’తో ప్రయత్నించాం, ఇందులో ప్రతి సీన్‌కీ ఓ లాజిక్ ఉంది’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. ఆయన దర్శకత్వం వహించిన ‘మంత్ ఆఫ్ మధు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో స్వాతి మాట్లాడుతూ ‘‘ఓ జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. అది అందరికీ నచ్చింది. ఈ సినిమాలో చేసిన లేఖ పాత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటా’’ అన్నారు. ‘‘తమిళ, మలయాళ భాషల్లో కొత్త తరహా సినిమాలొస్తున్నాయి. తెలుగులో రావడం లేదన్న ప్రశ్నకి ‘మంత్ ఆఫ్ మధు’ ఓ సమాధానం. ఈ సినిమాకి మంచి రివ్యూలు రావడం ఆనందంగా ఉంద’’న్నారు నవీన్ చంద్ర. ‘‘ఓవర్సీ్‌సలో కూడా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాని మరింత మందికి చేరువ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామ’’ని నిర్మాత యశ్వంత్ తెలిపారు.