Even if you leave the word... the step has gone viral : చెప్పు వదిలేసినా... స్టెప్పు వైరల్ అయింది
ABN , First Publish Date - 2023-11-09T02:35:49+05:30 IST
‘పుష్ప’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్‌పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ ఇందుకు వేదికైంది...

అమితాబ్ అభినందనలు
‘పుష్ప’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్‌పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ ఇందుకు వేదికైంది. ఇందులో ఓ కంటెస్టెంట్‌ను ఆయన ‘ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడు ఎవరు?’ అనే ప్రశ్నను అడిగారు. ఆ సందర్భంలో అమితాబ్ ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటను ప్రస్తావిస్తూ బన్నీని అభినందించారు. ‘‘పుష్ప’ అద్భుతమైన సినిమా. అల్లు అర్జున్ తన అభినయంతో పుష్ప పాత్రకు జీవం పోశాడు. ఆ చిత్రంలోని ‘శ్రీవల్లి’ గీతం జనాల్లోకి చొచ్చుకెళ్లింది. అందులో అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ తన చెప్పును వదిలేశారు. ఆ పాట వచ్చాక సోషల్ మీడియాలో చాలా మంది ఆ స్టెప్పును ఫాలో అయ్యారు. అందరూ తమ చెప్పులు వదిలే సి, మళ్లీ వేసుకునేవారు. ఆ స్టెప్పు అంతలా వైరల్ అవ్వడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలాంటిది నా జీవితంలో తొలిసారి చూశాను’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడి యో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.