కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దీపావళికి ‘ఎర్రచీర’

ABN, First Publish Date - 2023-08-12T00:30:17+05:30

శ్రీరామ్‌, అయ్యప్ప శర్మ, నటుడు రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజిస్విని, సుమన్‌బాబు తదితరులు నటించిన ‘ఎర్రచీర’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

శ్రీరామ్‌, అయ్యప్ప శర్మ, నటుడు రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజిస్విని, సుమన్‌బాబు తదితరులు నటించిన ‘ఎర్రచీర’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా నవంబర్‌ 9న రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘ మదర్‌ సెంటిమెంట్‌, హారర్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో చిత్రం తయారైంది. లక్షలాది మంది అఘోరాలతో చిత్రీకరించిన పతాక సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. సినిమాలో 35 నిమిషాల పాటు ఉన్న గ్రాఫిక్స్‌ వర్క్‌ కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.’ అని మరో నిర్మాత, నటుడు. దర్శకుడు సుమన్‌బాబు చెప్పారు. బేబి ఢమరి సమర్పకురాలు.

Updated Date - 2023-08-12T00:33:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!