వినోదం ప్లస్‌ సందేశం

ABN , First Publish Date - 2023-10-19T00:12:07+05:30 IST

సంపూర్ణేష్‌ బాబు, వి.కె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటించిన రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న...

వినోదం ప్లస్‌ సందేశం

సంపూర్ణేష్‌ బాబు, వి.కె.నరేశ్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటించిన రాజకీయ వ్యంగ్య చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, డైలాగులు అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘మంచి సందేశంతో వినోదభరితంగా సాగే సినిమా ఇది. వినోదం, సందేశం కలసి రావడం చాలా అరుదు. ఇప్పుడు పొలిటికల్‌ సీజన్‌ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. అయితే ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. రాజకీయాల వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న యథార్థ పరిస్థితుల్ని సినిమాగా చూపించాం. సంపూకి ఇది సెకండ్‌ లైఫ్‌ అవుతుంది. నేను, వెంకటేశ్‌ మహా ప్రధాన పాత్రలు పోషించాం. దాదాపు 30 మంది కొత్త వాళ్లు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు’ అన్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే పాత్రను తను పోషించినట్లు చెబుతూ ‘నా వయసు కంటే దాదాపు 20 ఏళ్లు తక్కువ ఉన్న పాత్రలో నటించాను. ఒకే గ్రామంలో రెండు మాండలీకాలు ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. ఎన్నికల సీజన్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నాం. సినిమాను ముందుగానే చూపించి విడుదల చేస్తున్నాం. ప్రీమియర్‌ చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్‌ చేశారు’ అన్నారు నరేశ్‌.

Updated Date - 2023-10-19T00:12:07+05:30 IST