కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలెవెన్‌

ABN, First Publish Date - 2023-08-17T04:05:08+05:30

నవీన్‌చంద్ర హీరోగా నటించే రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘ఎలెవెన్‌’ బుధవారం ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంతో లోకేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

నవీన్‌చంద్ర హీరోగా నటించే రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘ఎలెవెన్‌’ బుధవారం ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంతో లోకేశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజ్మల్‌ ఖాన్‌, రేయా హరి నిర్మాతలు. ఈ నెల 23 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని వారు చెప్పారు. దర్శకుడు లోకేశ్‌ మాట్లాడుతూ ‘మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు’ అని చెప్పారు. అభిరామి, రేయా హరి, దిలీపన్‌, రిత్విక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ అశోక్‌, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ ఎన్‌.బి.

Updated Date - 2023-08-17T04:05:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!