కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దసరాతో సందడి షురూ!

ABN, First Publish Date - 2023-10-18T03:06:15+05:30

రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. 2024 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే ఈ దసరా నుంచే ‘గేమ్‌ ఛేంజర్‌’ సందడి...

రామ్‌ చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. 2024 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే ఈ దసరా నుంచే ‘గేమ్‌ ఛేంజర్‌’ సందడి షురూ కానుంది. పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని వినిపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పండగ రోజు ఈ చిత్రంలోని పాటని విడుదల చేయనున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయం.. ఈ నేపథ్యంలో సాగే చిత్రమిది. రామ్‌ చరణ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయ నేతగా రెండు పార్శ్వాలున్న పాత్రని పోషిస్తున్నారు. సునీల్‌, అంజలి కీలక పాత్రధారులు.

Updated Date - 2023-10-18T03:06:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!