నాకు నేనే షాక్‌ ఇవ్వాలి!

ABN , First Publish Date - 2023-08-21T02:26:02+05:30 IST

‘నా అభిమానుల్లో అమ్మాయిలు ఎక్కువ. కొంతమంది ప్రవర్తన వల్ల నేను కొంచెం అసౌకర్యానికి లోనయ్యా. కొందరు ఫొటోలు తీసుకొంటూ..

నాకు నేనే షాక్‌ ఇవ్వాలి!

‘‘నా అభిమానుల్లో అమ్మాయిలు ఎక్కువ. కొంతమంది ప్రవర్తన వల్ల నేను కొంచెం అసౌకర్యానికి లోనయ్యా. కొందరు ఫొటోలు తీసుకొంటూ.. ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో ఓ పెద్దావిడ నన్ను అభ్యంతరకర రీతిలో తాకింది. ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా’’.

‘‘నటుడిగా కొత్త తరహా కథల కోసం అన్వేషిస్తున్నాను. నాకు నేనే షాక్‌ ఇచ్చే పాత్రల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ నా దగ్గరకు వచ్చింద’’న్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ఈనెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ గురించి దుల్కర్‌ ఏమన్నారంటే..

‘‘మలయాళంలో కొత్త అంటే.. టౌన్‌ అని అర్థం. ఓ టౌన్‌ పరిధిలో గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇంతకు ముందు నేను గ్యాంగ్‌స్టర్‌ సినిమా చేశాను కానీ, ఈ స్కేల్‌లో మాత్రం చేయలేదు. ఇందులో ప్రతి పాత్ర కథని ప్రభావితం చేస్తుంది. ఫ్రెండ్‌ షిప్‌, లవ్‌, ఫుట్‌ బాల్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి’’.

‘‘తెలుగులో నాకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొన్నా. ప్రతి భాషలోనూ ఓ సొగసు ఉంటుంది. ఆ శబ్ద సౌందర్యం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ లైన్‌ జాగ్రత్తగా రాసుకొని, అర్థం తెలుసుకొని మరీ డబ్బింగ్‌ చెప్పా. ‘గన్స్‌ అండ్‌ గులాబ్‌’ వెబ్‌ సిరీస్‌ కోసం ఐదు భాషల్లో డబ్బింగ్‌ చెప్పుకొన్నా. అదో అందమైన అనుభవం’’.

‘‘ఇది వరకు నా సినిమా విడుదల విషయంలో, పబ్లిసిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ మంచి సినిమాకి ఎలాంటి ఆటంకాలూ రాకూడదనే నిర్మాతగా మారాల్సివచ్చింది’’.

‘‘ప్రాజెక్ట్‌ కెలో నేను ఉన్నానో లేనో... నేను చెప్పకూడదు. అది చిత్రబృందమే వెల్లడించాలి. నేను ఇప్పటి వరకూ చాలా సినిమాలు చూశా. చాలా కథలు విన్నా. కానీ ‘ప్రాజెక్ట్‌ కె’ మాత్రం వేరే లెవల్‌’’.

Updated Date - 2023-08-21T02:26:02+05:30 IST