Drohi : నేషనల్ సినిమా డే స్పెషల్.. రూ.112లకే
ABN, First Publish Date - 2023-10-08T16:56:43+05:30
సందీప్‌కుమార్, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ద్రోహి'. ద క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్‌నెస్ డే ఎంటర్‌టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు.
సందీప్‌కుమార్, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ద్రోహి' (Drohi). ద క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్‌నెస్ డే ఎంటర్‌టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్ అంతా ప్రేమతో ఈ చిత్రం చేశారు. సక్సెస్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా" అన్నారు
హీరో సందీప్ మాట్లాడుతూ "ద్రోహి’ టైటిల్ వినగానే వెంటనే ఓకే చేసేశా. నాగార్జున నటించిన 'అంతం' సినిమాను హిందీలో ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే కమల్‌హాసన్ అర్జున నటించిన ఓ సినిమాను ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అందుకే అదే టైటిల్ అనుకున్నారు. అద్భుతమైన డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. క్రిమినల్ అనగానే క్రైమ్, థ్రిల్లర్ అనుకుంటాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ నెల 13న విడుదల సందర్భంగా ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్‌లో రూ.112లకే టికెట్ ఆఫర్ పెట్టాం’’ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ " ఏడాది క్రితం ఈ జర్నీ మొదలైంది. నాకు మంచి టీమ్ దొరికింది. ఏదైనా మనసు పెట్టే తీశాం. ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషనకు ఖర్చుపెట్టే బడ్జెట్‌తో మా సినిమా చేశాం. నేను అద్భుతం తీశానని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను. ఈ అంచనాలు వస్తున్న మా చిన్న చిత్రానికి మనసుపెట్టి కేవలం రెండు గంటలు
కేటాయించండి. సినిమా నిరాశ పరచడదని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు.